Telugu Gateway
Top Stories

మోడీ ఇమేజ్ ను డామేజ్ చేసింది ఇదే !

మోడీ ఇమేజ్ ను డామేజ్ చేసింది ఇదే !
X

రూపాయి పడిపోయింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ను కూడా పడగొట్టింది. 2022 సంవత్సరంలో మోడీ ఇమేజ్ ను బాగా డామేజ్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే అందులో కీలకమైనది రూపాయి పతనమే అంటున్నారు. ఈ విషయంలో మోడీ సర్కార్ అన్నీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. భారత కరెన్సీ రూపాయి కి కొత్త ఏడాది అయినా నూతన ఉత్సాహం వస్తుందా. అంటే అవుననే అంచనా వేస్తున్నారు.. నూతన సంవత్సరంలో మన కరెన్సీ రికవరీ సాధించే అవకాశం ఉందని చెపుతున్నారు. దేశ ప్రగతికి సంబంధించి..భవిష్యత్తు రిటర్న్స్ పై మంచి అంచనాలు ఉండటం కలిసి వస్తుంది అని భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు కొత్త ఏడాది లో కూడా పెద్ద ఎత్తున వస్తాయని భావిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఊగిసలాట కొనసాగే అవకాశం లేకపోలేదు అని చెపుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో పాటు పలు అంశాల కారణంగా దేశీయ కరెన్సీ రూపాయి 2022 సంవత్సరంలో దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే.

ఆసియాలోనే అత్యంత చెత్త పనితీరు కనపర్చిన కరెన్సీగా రూపాయి నిలిచింది. శుక్రవారం నాడు డాలర్ తో రూపాయి విలువ 82 .72 రూపాయల వద్ద ముగిసింది. అదే 2021 లో రూపాయి విలువ 74 .33 రూపాయల వద్ద ఉంది. 2022 సంవత్సరంలో మన కరెన్సీ విలువ 11 .3 శాతం మేర పతనం అయింది. 2013 తర్వాత ఇంత దారుణ పతనం ఇదే మొదటిసారి కావటం విశేషం. 2022 లో రూపాయి ఎన్నోసార్లు ఎప్పటికప్పుడు కొత్త కనిష్ట స్థాయికి పతనం అవుతూ పోయింది. రూపాయి పతనంపై మోడీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే గుజరాత్ సీఎం గా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక వేత్త ప్రధానిగా ఉన్న మన కరెన్సీ ఐసియు లో ఉందిగా అంటూ ఎద్దేవ చేశారు. మోడీ ప్రధాని అయ్యాక రూపాయి మరింత దారుణంగా పడిపోయింది.

Next Story
Share it