బెంగుళూరు విమానాశ్రంలో 'రోబోల సేవలు'
BY Admin3 Jun 2022 2:31 PM IST
X
Admin3 Jun 2022 2:31 PM IST
బెంగుళూరు విమానాశ్రయం కొత్త సేవలకు తెరతీసింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగత్మకంగా వీటిని రంగంలోకి దింపారు. తొలి దశలో పది రోబోలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే వీటి సంఖ్యను మరింత పెంచనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఇవి పనిచేస్తాయి. ఈ రోబోలు ప్రయాణికులకు బోర్డింగ్ గేటు తోపాటు షాపింగ్ ఏరియా, బ్యాగేజ్ క్లెయిమ్, తాగునీటి వసతులు వంటి సౌకర్యాల గురించి ప్రయాణికులకు వివరిస్తాయి. ఈ రోబో పేరు టెమిగా పిలుస్తారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ వన్ లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. టెమికి స్కై అనే పేరు కూడా ఉంది. ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వటమే కాకుండా..ఆయా ప్రాంతాలను ఇవి దగ్గర ఉండి మరీ చూపిస్తాయి.
Next Story