Telugu Gateway
Top Stories

రెమిడెసివర్ వాడొద్దు..డబ్ల్యూహెచ్ వో

రెమిడెసివర్ వాడొద్దు..డబ్ల్యూహెచ్ వో
X

కరోనా అంటే..రెమిడెసివర్. రెమిడెసివర్ తో పాటు స్టెరాయిడ్స్ వాడటంతో చాలా మంది కరోనా పేషంట్లు నానా ఇబ్బందులు పడ్డారు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పలు సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. దాదాపు ఏడాదిగా రెమిడెసివర్ వాడకం పెద్ద ఎత్తున సాగింది. ఈ కారణంగానే ఈ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ కూడా అదే స్థాయిలో సాగింది. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కరోనా చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది. అందుకే కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్‌లోనూ కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని.. కరోనా బాధితులెవరికి ఆ ఇంజక్షన్‌ వాడొద్దని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story
Share it