Telugu Gateway
Top Stories

నిధుల సమీకరణలో కొత్త రికార్డు ఖాయం!

నిధుల సమీకరణలో కొత్త రికార్డు ఖాయం!
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఐపీవోకి రంగం సిద్ధం అవుతోంది. వాస్తవానికి 2026 మొదటి ఆరునెలల కాలంలోనే ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తి కావాల్సి ఉంది. ఈ మేరకు గతంలో రిలయన్స్ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ లు చేసిన దాడులతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా మార్కెట్లు చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాజాగా శాంతి ఒప్పందం కుదరటం...మార్కెట్ లు తిరిగి గాడిన పడటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఐపీవోకు సంబంధించి సెబీ ముందు పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంది అని..అది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం జరగనున్న జూన్ 19 లోపే ఉండే అవకాశం ఉంది వార్తలు వస్తున్నాయి. ఈ ఐపీవో ద్వారా రిలయన్స్ జియో మార్కెట్ నుంచి దగ్గర దగ్గర 38 వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సమీకరించే అవకాశం ఉంది. దేశంలోనే ఇప్పటివరకు అతి పెద్ద ఐపీవోగా కూడా రిలయన్స్ ఐపీవో నిలవబోతుంది.

ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఐపీవో అంటే 2024 లో మార్కెట్లోకి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇష్యూనే. ఈ కంపెనీ మార్కెట్ నుంచి 27870 కోట్ల రూపాయలను సమీకరించింది. దీని తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) దే. ఈ సంస్థ ఐపీవో ద్వారా 21008 కోట్ల రూపాయలు సేకరించింది. ఇప్పుడు ఈ రికార్డులు అన్నిటిని రిలయన్స్ జియో ఐపీవో బద్దలు కొట్టనుంది. జూన్ 19 న జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ముఖేష్ అంబానీ జియో ఐపీవో తో పాటు కంపెనీ భవిష్యత్ ప్రణాళికలపై ఎలాంటి ప్రకటన చేస్తారా అని మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సహజంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం అంటే మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాయి.

Next Story
Share it