Telugu Gateway
Top Stories

రిలయన్స్ తొలి కంపెనీ

రిలయన్స్ తొలి కంపెనీ
X

దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇండియాలో ఇప్పటి వరకు ఇరవై లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా ఇది ఇది రికార్డు క్రియేట్ చేసింది. మంగళవారం నాడు మార్కెట్ లో కంపెనీ షేర్లు 2958 రూపాయల గరిష్ట స్థాయికి చేరటంతో రిలయన్స్ ఈ ఫీట్ సాధించింది. గత పన్నెండు నెలల కాలంలో రిలయన్స్ షేర్ దగ్గర దగ్గర నలభై శాతం మేర లాభ పడింది. అయితే మంగళవారం నాడు మార్కెట్ లు ముగిసే సమయంలో ఈ షేర్ బిఎస్ఈలో 26 రూపాయల లాభంతో 2928.95 రూపాయల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి సారి 2005 సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది.

తర్వాత 2007 లో రెండు లక్షల కోట్లు, 2017 లో ఐదు లక్షల కోట్లు, 2019 లో పది లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కు చేరుకుంది. 2021 లో 15 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు ఏకంగా ఇరవై లక్షల కోట్లకు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ ఇదే కావటం విశేషం. మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత 15 లక్షల కోట్ల రూపాయలతో టిసిఎస్ రెండవ స్థానంలో ఉంటే...హెచ్ డిఎఫ్ సి 10 .5 లక్షల కోట్ల తో మూడవ స్థానంలో ఉంది.

Next Story
Share it