Telugu Gateway
Top Stories

మార్చి నెలాఖరు నుంచి రెగ్యులర్ రైళ్లు!

మార్చి నెలాఖరు నుంచి రెగ్యులర్ రైళ్లు!
X

దేశంలో ప్రస్తుతం అన్నీ ఓపెన్ అయ్యాయి. కానీ రైల్వే శాఖ మాత్రం కోవిడ్ కు ముందు తరహాలో రైల్వే సర్వీసులను మాత్రం ప్రారంభించలేదు. కొన్ని రాష్ట్రాల్లో తప్ప దేశంలో కరోనా కేసుల ఉధృతి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అయితే మార్చి నెలాఖరు నుంచి సాధారణ సర్వీసులు అన్నీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని 'టైమ్స్ ఇండియా' కథనం వెల్లడించింది.

లోకల్ ట్రైన్లతోపాటు ఎక్స్ ప్రెస్, మెయిల్ ట్రైన్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలతో చర్చలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో 1130 రైళ్లు నడుస్తున్నాయి. కరోనాకు సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే సాధారణ రైల్వే సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. కరోనాను నియంత్రించే క్రమంలో రైల్వే సాధారణ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it