Telugu Gateway
Top Stories

నిజ‌జీవిత కుంభ‌క‌ర్ణుడు..ఏడాదిలో 300 రోజులు నిద్రే

నిజ‌జీవిత కుంభ‌క‌ర్ణుడు..ఏడాదిలో 300 రోజులు నిద్రే
X

రామాయ‌ణంలో మ‌న‌కు కుంభ‌క‌ర్ణుడి గురించి తెలుసు. ఆయ‌న ఆరు నెల‌లు వ‌ర‌స‌గా నిద్ర‌పోతాడు. కానీ ఈ నిజజీవిత కుంభ‌క‌ర్ణుడు మాత్రం ఆయ‌న‌కంటే భిన్నం. ఈయ‌న ఏడాదిలో ఆయ‌న 300 రోజులు నిద్ర‌లోనే ఉంటారు. ప్ర‌తి నెల‌లో వ‌ర‌స‌గా 25 రోజులు నిద్రేపోతారు. ఇది ఏకంగా 23 సంవ‌త్స‌రాల నుంచి అలా సాగుతూనే ఉంది. మిగిలిన 65 రోజులు మేల్కొని ఉన్నా..అది కూడా అంతంత మాత్రంగానే. అరుదైన వ్యాధి కార‌ణంగానే ఆయ‌న ఈ ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. హైప‌ర్ సోమ్నియా అనే అతి నిద్ర వ్యాధి కార‌ణంగా ఆయ‌న జీవితంలో ఎక్కువ కాలం నిద్ర‌లోనే గడిపేస్తున్నారు. ఈ అరుదైన వ్యాధి బారిన ప‌డ్డ వ్య‌క్తి పేరు పుర్క‌రం. ఆయ‌న వ‌యస్సు 42 సంవ‌త్స‌రాలు. ఇలా ఎక్కువ కాలం నిద్రపోతూనే ఉండటం వ‌ల్ల నిత్యం తీవ్ర అల‌స‌ట‌తోనే ఉంటాడ‌ని చెబుతున్నారు ఆయ‌న కుటుంబ స‌భ్యులు.

ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే పుర్క‌ర‌మ్ మేల్కొని ఉన్న కాలంలో మాత్రం ఓ షాప్ నిర్వ‌హిస్తాడు. అది కూడా నెల‌కు ఓ ఐదు రోజులు మాత్ర‌మే. నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు భోజనం, స్నానం వంటి బాధ్య‌త‌లు అన్నీ కుటుంబ స‌భ్యులే చూసుకుంటారు. పుర్క‌రం కుటుంబ స‌భ్యులు తొలుత ఆయ‌న నిద్ర‌కు కార‌ణం క‌నుక్కొనేందుకు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించారు. తొలుత ఇది రోజుకు 15 గంట‌లు ఉండేది అలా క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుకుంటూ పోయింది. రోజులు గ‌డిచేకొద్దీ ఇలా నిద్ర‌పోయే కాలం కూడా పెరిగింది. అయితే పుర్క‌ర‌మ్ భార్య లిచిమి దేవి, త‌ల్లి క‌న్వ‌రి దేవిలు మాత్రం ఆయ‌న ఈ స‌మస్య నుంచి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డ‌తార‌ని విశ్వ‌శిస్తున్నారు. ఆ ఆస‌క్తిక‌ర వార్తను ప‌లు జాతీయ ఛాన‌ళ్ళ‌కు వెబ్ సైట్లు ప్రచురించాయి.

Next Story
Share it