Telugu Gateway
Top Stories

రెయిన్ బో ఆస్ప‌త్రి ప‌బ్లిక్ ఇష్యూ

రెయిన్ బో ఆస్ప‌త్రి ప‌బ్లిక్ ఇష్యూ
X

చిన్న‌పిల్ల‌లకు వైద్య సేవ‌లు అందించ‌టంలో రెయిన్ బో ఆస్ప‌త్రికి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో సేవ‌లు అందిస్తున్న రెయిన్ బో ఇప్పుడు త‌న కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్త‌రించేందుకు స్టాక్ మార్కెట్ నుంచి నిధులు స‌మీక‌రించేందుకు రెడీ అయింది. రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్ ఏప్రిల్‌ 27,2022 న ప్రారంభం కానుంది. పది రూపాయల ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ 516 –542 రూపాయలుగా నిర్ణ‌యించారు. ప‌బ్లిక్ ఇష్యూ ఏప్రిల్ 27న ప్రారంభ‌మై ఏప్రిల్ 29న ముగుస్తుంది. రెయిన్ బో మెడికేర్ పిడియాట్రిక్‌, అబ్‌స్టెట్రిక్‌ , గైనకాలజీ విభాగాల్లో సేవ‌లుఅందిస్తోంది. దేశవ్యాప్తంగా ఆరు నగరాలు (హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం)లో 14 హాస్పిటల్స్‌, మూడు క్లినిక్స్‌ నిర్వహిస్తోన్న ఈ సంస్ధకు డిసెంబర్‌ 31,2021 నాటికి 1500 పడకలు ఉన్నాయి.

ఈ ఐపీఓలో భాగంగా పది రూపాయల ముఖ విలువ కలిగిన 24,000,900 ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సెల్లింగ్‌ షేర్‌ హోల్డర్లు విక్రయించనుండగా 2800 మిలియన్‌ రూపాయల విలువ కలిగిన షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. ఈ ఆఫర్‌లో భాగంగా 300000 ఈక్విటీ షేర్లను ఉద్యోగుల కోసం కేటాయించారు. ఈ ఆఫర్‌ ద్వారా సమీకరించిన మొత్తాలను ఎన్‌సీడీల ముందస్తు రిడంప్షన్‌తో పాటుగా నూతన హాస్పిటల్స్‌ ఏర్పాటు, నూతన వైద్య పరికరాల కొనుగోళ్లతో పాటుగా సాధారణ కార్పోరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నారు.కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌, జె.పి. మోర్గాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌లు ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఐపీవో వివ‌రాల‌ను రెయిన్ బో సీఎండీ ర‌మేష్ కంచ‌ర్ల శుక్ర‌వారం నాడు హైద‌రాబాద్ లోమీడియాకు వివ‌రించారు.

Next Story
Share it