Telugu Gateway
Top Stories

టీమ్ ఇండియా ప్ర‌ధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్

టీమ్ ఇండియా ప్ర‌ధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్
X

భార‌త క్రికెట్ లో కీల‌క ప‌రిణామం. టీ20 ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత భార‌త క్రికెట్ ప్ర‌ధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశం ఉంది. నూత‌న బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు రాహుల్ ద్రావిడ్ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా ఎంతో మంది మెరికల్లాంటి యువ ఆటగాళ్లను ద్రవిడ్ తీర్చిదిద్దారు.ఇకపై టీమిండియాకు శిక్షణ ఇవ్వనున్నట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. తొలుత ఈ పదవి చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా.. ద్రవిడ్‌ను ఒప్పించినట్లు సమాచారం.

అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ ప్ర‌ధాన కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నుండ‌టం భార‌త క్రికెట్ కు మంచి ప‌రిణామంగా క్రీడాభిమానులు భావిస్తున్నారు. ర‌విశాస్త్రి తీరుపై గతంలో చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాహుల్ ఎప్పుడూ వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుపోతార‌నే పేరు ఉంది.

Next Story
Share it