Telugu Gateway
Top Stories

క్వాంటాస్ ఏ 380 ..ఎగరాలంటే 4500 గంటలు కష్టపడాలంట!

క్వాంటాస్ ఏ 380 ..ఎగరాలంటే 4500 గంటలు కష్టపడాలంట!
X

ఏ 380 విమానం.ప్రపంచంలోనే అతి పెద్ద విమానాలు ఇవి. డబుల్ డెక్కర్ విమానాలుగా కూడా వీటిని పిలుస్తారు. ఒక్కసారి పక్కన పెట్టిన ఈ విమానాలను తిరిగి మళ్ళీ ఎగిరే స్థితికి తేవాలంటే మాములు విషయం కాదు. దీనిపై ఏకంగా 4500 గంటలు పనిచేయాలంట.ఆస్ట్రేలియా కి చెందిన క్వాంటాస్ ఎయిర్ వేస్ తన అధీనంలో ఉన్న 12 ఎయిర్ బస్ ఏ 380 విమానాలను పక్కన పెట్టింది. దీనికి కారణం కరోనా తో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు విమానాలు కేవలం పార్కింగ్ కి పరిమితం అయ్యాయి. అంతర్జాతీయంగా ఇప్పుడు విమాన ప్రయాణాలు ఊపు అందుకోవటంతో క్వాంటాస్ కూడా తిరిగి తన 10 ఏ 380 విమానాలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. అయితే ఇది కూడా చాలా కష్టంతో కూడుకున్న పనిగా మారింది.

ఎందుకంటే మోజావో ఎడారిలో ఉంచిన ఈ విమానాలను మళ్ళీ ఎగిరే స్థితికి తేవాలంటే దీనిపై ఇంజినీర్లు 4500 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ విషయం క్వాంటాస్ ఎయిర్ వేస్ సీఈఓ అలాన్ జాయిస్ వెల్లడించారు. అంతే కాదు ఈ విమానానికి సంబంధించి 22 చక్రాలు, 16 బ్రేక్స్, అన్ని ఆక్సిజన్ సీలిండర్స్ మార్చాల్సి వచ్చింది. విమానంలో ఉన్న కీలక భాగాలను తిరిగి కొత్తవి వేయాల్సి వచ్చింది. ఈ సమస్య ఒక్క క్వాంటాస్ ఎయిర్ వేస్ దే కాదు. కరోనా కారణంగా పక్కన పెట్టిన విమానాలను తిరిగి ఫ్లైయింగ్ కండిషన్ కు తీసుకు రావాలంటే చాలా సమస్యలు వస్తున్నాయని ఎయిర్ లైన్స్ వాపోతున్నాయి. అందుకే పలు విదేశీ రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచాయి ఎయిర్ లైన్స్ అన్నీ. దీంతో ప్రయాణికులపై కూడా భారం పడుతోంది.

Next Story
Share it