Telugu Gateway
Top Stories

సింగ‌పూర్ ఓపెన్ విజేత పీ వీ సింధు

సింగ‌పూర్ ఓపెన్ విజేత పీ వీ సింధు
X

భార‌త ష‌టిల్ దిగ్గ‌జం పీ వీ సింధు మ‌రో కొత్త రికార్డును న‌మోదు చేసింది. సింగ‌పూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవ‌టం ద్వారా ఆదివారం నాడు త‌న ఖాతాలో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఆమె ఖాతాలో తొలి సూప‌ర్ 500 టైటిల్ ఇదే కావ‌టం విశేషం. సింగ‌పూర్ ఓపెన్ లో పీ వీ సింధు చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిని ఓడించి టైటిల్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుత సీజ‌న్ లో సింధూకి ఇది మూడ‌వ టైటిల్. ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్‌ జి యిను 21-9, 11-21, 21-15 స్కోరుతో ఓడించింది. తొలిసారి సింగ‌పూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న పీ వీ సింధుకు పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

Next Story
Share it