Telugu Gateway
Top Stories

బైక్ పై యువతి ప్రపంచ యాత్ర !

బైక్ పై యువతి ప్రపంచ యాత్ర !
X

ఫ్రెండ్స్ చాలా మంది గ్రూప్ లుగా బైక్ లపై దేశంలోని పలు ప్రాంతాలకు వెళతారు. కొంతమంది విదేశీ పర్యటనలు కూడా చేస్తారు. ఇలాంటి హాబీ చాలా మందికి ఉంటుంది. కానీ ఒక యువతి బైక్ పై తలపెట్టిన ప్రపంచ పర్యటన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పూణే కు చెందిన ఓ యువతి బైక్ పై ప్రపంచ యాత్రకు సిద్ధమయ్యారు. ఆమె మార్చి 9 నుంచి దీనికి శ్రీకారం చుట్టనున్నారు. 27 సంవత్సరాల రమీలా లాటపతే. నవారి చీరతోనే ఆమె ఈ పర్యటన చేయనుండటం మరో విశేషం. తాను వెళ్లే ప్రతి దేశంలో భారతీయ, మహారాష్ట్ర సంస్కృతిని ప్రచారం చేస్తానన్నారు. ఆమె మొత్తం ఏడాది పాటు ఈ పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన నుంచి ఆమె తిరిగి 2024 మార్చి 8 న తిరిగి రానున్నారు.

రమీలా తన పర్యటన ద్వారా మొత్తం లక్ష కిలోమీటర్లు టూర్ చేయనున్నారు. ఈ సమయంలో ఆమె మొత్తం 20 దేశాలను కవర్ చేయనున్నారు. తన పర్యటన సందర్భంగా మహిళా గ్రూపులు తయారు చేసిన ఐటమ్స్ తీసుకెళ్లనున్నారు. మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్న కూడా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా బయటి దేశాల వాళ్లకు చేరటం లేదని ఆమె చెపుతున్నారు. రమీలా తన 16 వ ఏట నుంచే పర్యటనలు చేయటం అలవాటు చేసుకుంది. తన తండ్రి ప్రతి ఏటా ఒక్కో కొత్త ప్రాంతానికి తీసుకెళ్లేవారు అని..అప్పటి నుంచే తనకు కొత్త ప్రాంతాల సందర్శన ఆసక్తి పెరిగింది అని తెలిపారు. దేశంలోని పలు మారుమూల ప్రాంతాలు, గతం లో పలు దేశాలు కూడా సందర్శించినట్లు వెల్లడించారు.

Next Story
Share it