సన్ రూఫ్ ఫీచర్ తో బ్రెజ్జా న్యూ మోడల్

మారుతి బ్రెజ్జా కొత్త హంగులు సంతరించుకుంది. ఇతర కంపెనీల మోడల్స్ తో పోలిస్తే ధర తక్కువ..లుక్ పరంగా ఆకట్టుకునేలా ఉండటంతో బ్రెజ్జా సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇదే జోష్ తో ఈ కారులో భారీ ఎత్తున మార్పులు చేస్తూ కొత్త మోడల్ ను విడుదల చేసింది మారుతి సుజుకి. అంతే కాదు...తొలిసారి ఇందులో సన్ రూప్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. కొత్త మోడల్ బుకింగ్స్ ను ప్రారంభించింది. 2022 మారుతి సుజుకి బ్రెజ్జా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కొత్త 2022 బ్రెజ్జా కస్టమర్లు షోరూమ్‌లో లేదా ఆన్‌లైన్‌లో 11 వేలకు ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.
సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీకి స్టైలింగ్, ఫీచర్లు టెక్ పరంగా బారీ మేక్ఓవర్‌తో తెస్తోంది. ముఖ్యంగా కొత్త బ్రెజ్జా తొలి సన్‌రూఫ్ కారుగా రావడం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.కార్ టెక్ కనెక్ట్ , ప్యాడిల్ షిఫ్టర్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లేదా ESPతో అప్‌డేట్ చేయబడిన ఇంజీన్‌ను జోడించినట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం 6 సంవత్సరాలలో 7.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో, దేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బ్రెజ్జా బలమైన మార్కెట్ ను దక్కించుకుంది.



