Telugu Gateway
Top Stories

ఇప్పుడే ఎందుకు నాన్ లోక‌ల్ అంశం వ‌స్తోంది?

ఇప్పుడే ఎందుకు నాన్ లోక‌ల్ అంశం  వ‌స్తోంది?
X

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నికల అంశంపై సీనియ‌ర్ ప్ర‌కాష్ రాజ్ టీమ్ శుక్రవారం నాడు మీడియా ముందుకు వ‌చ్చింది. వీరు ప‌లు అంశాల‌పై స్పందించారు. మా ఎన్నిక‌ల‌కు సంబంధించి మీడియా హ‌డావుడిని చూస్తే భయం వేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నిక‌ల‌కు మీడియా చేసే హడావుడి వల్ల ఇక్కడి నేతలే కాదు జో బైడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసింద‌న్నారు. ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యలు ఆయ‌న మాట‌ల్లోనే...ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు. ఆరు నెలలు గా ఈ కార్యక్రమం నడుస్తోంది. మా ప్యానెల్ లో ఎవరు ఉండాలి ఎలాంటి వారు ఉండాలి అని చూసాం. ఇవి ఎన్నికల్లాగా కాకుండా అందరి సంక్షేమం కొసం చేస్తుంది. మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం. ఇది మా ఆవేదన. గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి. నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు ఉన్నారు.తరువాత నేను తప్పు చేసిన బయటికి పంపిస్తారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు మా టీమ్ లో.

సమస్య గురుంచి మాట్లాడకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను డిసైడ్ చేస్తున్నారు. ఇందులో లోకల్ నాన్ లోకల్ సమస్య సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ రాలేదు. ఇప్పుడే ఎందుకు?. తెలుగు అనేది గౌరవం. అనేక మంది ఇతర భాషల్లో రాణిస్తున్నారు.క‌ళాకారులు యూనివ‌ర్శ‌లు. వాళ్ళ‌ను ఒక భాష‌కు ప‌రిమితం చేయ‌కూడ‌దు. మాది ఆవేదన తో పుట్టిన ప్యానెల్. ఇది అవమానాలు ,కష్టాలతో పుట్టిన ప్యానెల్ అని వ్యాఖ్యానించారు. ప‌ద‌వి కోసం పోటీ చేయ‌టంలేద‌ని..ప‌ని చేయ‌టం కోస‌మే పోటీచేస్తున్నామ‌న్నారు. అర్హ‌త చూసి ఓటు వేయాల‌ని కోరారు. త్వ‌ర‌గా ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించాల‌ని ప్ర‌కాష్ రాజ్ డిమాండ్ చేశారు.

Next Story
Share it