Telugu Gateway
Top Stories

అభ్య‌ర్ధుల‌ను ప్ర‌కటించాక 48 గంట‌ల్లో నేర‌చ‌రిత్ర చెప్పాలి

అభ్య‌ర్ధుల‌ను ప్ర‌కటించాక  48 గంట‌ల్లో నేర‌చ‌రిత్ర చెప్పాలి
X

రాజ‌కీయాల్లో నేర‌చరితుల ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన 48 గంట‌ల్లో రాజ‌కీయ పార్టీలు వారి నేర‌చరిత్ర వెల్ల‌డించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. అంతే కాదు..నేర‌చ‌రిత్ర ఉన్న వారిని ఎంపిక చేయ‌టానికి గ‌ల కార‌ణాల‌ను చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. గ‌తంలోనే ఇలాంటి నిబంధ‌న అమ‌ల్లో ఉన్నా....చాలా మంది వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు లేవు.

2020 బీహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నేర‌చ‌రిత్ర ఉన్న వారి వివ‌రాలు ప్ర‌క‌టించ‌లేదు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. దీనికి సంబంధించి 2020 ఫిబ్ర‌వ‌రిలో ఇచ్చిన తీర్పులో కొన్ని మార్పులు చేస్తూ సుప్రీం తాజా ఆదేశాలు జారీ చేసింది. జ‌స్టిస్ నారిమ‌న్. గ‌వైల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది. ఇది రాజ‌కీయ పార్టీల‌కు ఏ మాత్రం మింగుప‌డ‌ని అంశ‌మే.

Next Story
Share it