ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి ప్రధాని కార్యాలయం
BY Admin18 Dec 2020 10:00 PM IST

X
Admin18 Dec 2020 10:00 PM IST
ప్రధాని నరేంద్రమోడీ నియోజకవర్గం అయిన వారణాసి ఆఫీసును కొంత మంది దుండగులు ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. అది కూడా 7.5 కోట్ల రూపాయలకు అమ్ముతామని పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి వారణాసి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. అంతే కాదు..ఓఎల్ఎక్స్ నుంచి యాడ్ ను కూడా తొలగించారు.
ప్రధాని ఆఫీసు 6500 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన విల్లా అని, అందులో నాలుగు రూమ్ లు, నాలుగు బాత్ రూమ్స్ ఉన్నాయని లిస్ట్ చేశారు. ఈ ఆఫీస్ గురుధామ్ కాలనీలో ఉంది. ఈ యాడ్ పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. వారణాసి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన అంశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Next Story



