Telugu Gateway
Top Stories

ప్రపంచంలో తొలి కరోనా అధికారిక వ్యాక్సిన్ ఆమెకే

ప్రపంచంలో  తొలి కరోనా అధికారిక వ్యాక్సిన్  ఆమెకే
X

కరోనాకు సంబంధించిన తొలి అధికారిక వ్యాక్సిన్ తీసుకున్న మహిళగా ఆమె రికార్డులకు ఎక్కారు. బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి మంజూరు చేసి వ్యాక్సినేషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే బ్రిటన్ లో ఫైజర్ వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వటం ప్రారంభించారు. మొదటి టీకాను 90 సంవత్సరాల వయస్సు ఉన్న మార్గరేట్ కీనన్ కు అందించారు. ఆమె ఇంగ్లాండ్ కోవెంట్రీలోని యూనివర్శిటీ ఆస్పత్రిలో ఉన్నారు.

టీకా తీసుకోవటంపై ఆమె స్పందిస్తూ మొదటి వ్యాక్సిన్ తీసుకోవటం చాలా ఆనందంగా..ప్రత్యేకంగా ఉందని వ్యాఖ్యానించారు. తన పుట్టిన రోజుకు గొప్ప బహుమతే ఇదే అన్నారు. ఈ ఏడాది చాలా వరకూ ఒంటరిగానే సమయాన్ని గడపాల్సి వచ్చింది. త్వరలోనే కుటుంబం, స్నేహితులను కలసి సమాయన్ని గడపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అమెరికా కు చెందిన ఎఫ్ డీఏ కూడా ఈ నెల 10న సమావేశం అయి ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగానికి సంబంధిచంని అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

Next Story
Share it