నవంబర్ 1 నుంచి పీబీ ఫిన్‌టెక్ ఐపీవో ప్రారంభం
ప్రస్తుతం ఐపీవోల సీజన్ నడుస్తోంది. పలు కంపెనీలు మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధులు సమీకరిస్తున్నాయి. ఐపీవోల బూమ్ ను కూడా వాడుకునేందుకు సంస్తలు పోటీపడుతున్నాయి. పీబీ ఫిన్‌టెక్ లిమిటెడ్ కూడా ఐపీవోకి వస్తోంది. ఈ సంస్త రెండు రూపాయల ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ల ప్రైస్‌బ్యాండ్ 940 రూపాయల నుంచి 980 రూపాయలుగా నిర్ణయించారు. నవంబర్ 01,2021న తెరిచే ఈ ఆఫర్‌ను నవంబర్ 03,2021న ఇష్యూ ముగుస్తుంది. కనీసం 15 ఈక్విటీ షేర్లతో బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సాంకేతికత, డాటా, ఆవిష్కరణలపై ఆధారపడి భీమా మరియు ఋణ అవకాశాలను అందిస్తున్న అతిపెద్ద ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ పీబీ ఫిన్‌టెక్ లిమిటెడ్. ఐపీవోలో భాగంగా తాజాగా 37,500 మిలియన్ రూపాయల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఎస్‌వీఎఫ్ పైథాన్ 2 (కేమాన్ ) లిమిటెడ్‌కు చెందిన 18,750 మిలియన్ రూపాయల షేర్లను విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు.
భీమా, ఋణ మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తులను అత్యంత సౌకర్యవంతంగా అందించడంతో పాటుగా భారతీయుల నడుమ వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆఫర్ ద్వారా సమీకరించిన మొత్తాలను పాలసీ బజార్ మరియు పైసాబజార్ కు మాత్రమే కాకుండా సంస్థకు చెందిన బ్రాండ్ల పట్ల అవగాహన మెరుగుపరచడం, నూతన అవకాశాల అన్వేషణ, వ్యూహాత్మక పెట్టుబడులు, విలీనాలు మరియు భారతదేశంకు ఆవల విస్తరణ, సాధారణ కార్పోరేట్ కారణాల కోసం వినియోగించనున్నారు. ఈ ఆఫర్ లో భాగంగా జారీ చేసే ఈక్విటీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ చేయనున్నారు.