Telugu Gateway
Top Stories

కొత్త కనిష్ఠానికి పేటిఎం షేర్లు

కొత్త కనిష్ఠానికి పేటిఎం షేర్లు
X

స్టాక్ మార్కెట్ లో పేటిఎం షేర్ల పతనంతో ఇన్వెస్టర్లు విలవిలలాడుతున్నారు. ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పటి వరకు లాభాలు ఆర్జించలేదు. ఇది ఒక అంశం అయితే కొద్ది రోజుల క్రితం ఆర్ బిఐ విధించిన ఆంక్షలతో ఈ షేర్ వరసగా పతనం అవుతూ వస్తోంది. మంగళవారం నాడు ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి 380 రూపాయల వద్ద ముగిసింది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మెక్వారీపేటిఎం షేర్ ను అండర్ పెర్ ఫార్మర్ గా చెపుతూ టార్గెట్ ధరను ఏకంగా 650 రూపాయల నుంచి 275 రూపాయలకు తగ్గించింది.

ఇది కూడా షేర్ ధరపై తీవ్ర ప్రభావం చూపించింది అని చెప్పాలి. ఆర్ బిఐ ఆదేశాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు పేటిఎం షేర్లు 45 శాతం మేర నష్టపోయాయి. ఈ గండం నుంచి గట్టు ఎక్కేందుకు పేటిఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా...షేర్ ధర పతనం ఆగుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

Next Story
Share it