Telugu Gateway
Top Stories

పేటీఎంకు ఆర్ బిఐ షాక్

పేటీఎంకు ఆర్ బిఐ షాక్
X

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బిఐ ) విధించిన ఆంక్షలతో స్టాక్ మార్కెట్ లో పేటీఎం షేర్లు విల విలలాడుతున్నాయి. మార్కెట్ లు ఓపెన్ అయిన వెంటనే ఈ షేర్ 20 శాతం లోయర్ సర్క్యూట్ బ్రేకర్ ను తాకింది. అమ్మే వాళ్ళు తప్ప...ఈ షేర్లు కొనేవాళ్లే లేరు. బిఎస్ఈలో పేటిఎం షేర్లు 152 రూపాయలు నష్టపోయి..608 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ బిఐ ఆదేశాలతో రాబోయే రోజుల్లో ఈ షేర్ మరింత పతనం అయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఐపీఓ ల్లో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఇష్యూ కూడా ఒకటి. కానీ ఇప్పటి వరకు ఈ ఐపీఓ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాభాలు ఆర్జించిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షేర్ ధర కు తాజా ఆర్ బిఐ ఆదేశాలు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. దీంతో మరికొంత కాలం ఈ షేర్ లో తీవ్ర ఒడిదుడుకులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్ బిఐ ఆదేశాలపై పేటీఎం యాజమాన్యం స్పందించి ఆర్ బిఐ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు మరింత పక్కాగా పాటించేందుకు అవసమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

సాధ్యమైనంత వేగంగా నియంత్ర సంస్థ లేవనెత్తిన ఆందోళనలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఆర్ బిఐ మాత్రం బయటి ఆడిటర్లు ఇచ్చిన నివేదికలోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ చర్యలకు ఉపక్రమించనట్లు వెల్లడించింది. పేటీఎం పే మెంట్స్ బ్యాంకు వినియోగదారుల నుంచి డిఫాజిట్స్ స్వీకరించకుండా ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని స్పష్టం చేసింది. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్ స్ట్రుమెంట్స్ , వాలెట్స్ , ఫాస్టాగ్ లు వంటి వాటిల్లో కూడా క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్ లు కూడా అప్పటి నుంచి అనుమంతించ కూడదు అని ఆర్ బిఐ తాజాగా ఆదేశించింది. ఇదే ఇప్పుడు కంపెనీ పై తీవ్రప్రభావం చూపించబోతుంది. పేటిఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కంపెనీ షేర్లపై ఎలాంటి మార్జిన్ లోన్లు తీసుకోలేదు అని..షేర్లను కూడా తనఖా పెట్ట లేదు అని స్టాక్ ఎక్స్చేంజ్ లకు సమాచారం ఇచ్చారు.

Next Story
Share it