Telugu Gateway
Top Stories

పేటిఎంపై ఈడీ విచారణ!

పేటిఎంపై ఈడీ విచారణ!
X

స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. మరి కొంత మందికి ఇది ఎప్పటికి అర్ధం కాని సబ్జెక్టు. చాలా మంది ఇటు వైపు అసలు కన్నెత్తి కూడా చూడరు. అయినా సరే ఇందులో పెట్టుబడి పెట్టే వారు కూడా చాలా మందే ఉంటారు. కాని కొన్ని సార్లు...కొన్ని షేర్ల విషయంలో చోటు చేసుకునే పరిణామాలు మాత్రం ఇన్వెస్టర్లకు ఎప్పటికి మిస్టరీగానే ఉంటాయి. ఇప్పుడు పేటిఎం ఇన్వెస్టర్లది అదే పరిస్థితి. ఈ కంపెనీ నిబంధలు ఉల్లఘించింది అనే అబియోగంతో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బీఐ ) పేటిఎం ప్రెమెంట్స్ బ్యాంకు సర్వీస్ లపై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి అంటే ఈ ఆదేశాలు వచ్చిన పది రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 26000 కోట్ల రూపాయల మేర హరించుకు పోయింది. బుధవారం నాడు కూడా పేటిఎం షేర్లు పది శాతం మేర నష్టపోయి...342 రూపాయల కనిష్ట స్థాయికి పతనం అయ్యాయి. 2023 సంవత్సరం అక్టోబర్ లో ఈ షేర్ ధర 998 రూపాయల గరిష్ట స్థాయికి చేరింది.

ఈ ధరతో పోలిస్తే పేటిఎం షేర్లు 65 శాతం పైగా పతనం అయినట్లు అయింది. ఈ కంపెనీ పై విధించిన ఆంక్షల విషయంలో ఆర్ బీఐ కఠినంగా ఉంటడంతో ఈ కంపెనీ షేర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. మరో వైపు పేటిఎం పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లను మరింత కలవరానికి గురి చేస్తోంది. ఆర్ బీఐ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగానే ఈడీ విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఇది ప్రాథమిక దశలోనే ఉంది అని...పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలా వద్దా అనే అంశంపై అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మరో వైపు కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా పేటిఎం లో పని చేస్తున్న ఉద్యోగులు కొత్త మార్గాలను వెతుక్కునే పనిలో పడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it