Telugu Gateway
Top Stories

డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ ప్రకటన

డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ ప్రకటన
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక ప్రాంతీయ పార్టీ అధినేత కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆయన రెండవసారి అదికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు...చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాయి. అంతే కాదు అమెరికన్లను కూడా షాక్ కు గురి చేస్తున్నాయి. ప్రధానంగా సుంకాలను సంబంధించి ఆయన చేసిన ప్రకటనలు ప్రపంచ మార్కెట్లను ఆగమాగం చేశాయి. తాజాగా ఐటి ఉద్యోగాలకు సంబంధించిన ఆయన చేసిన ప్రకటన అమెరికాలోని దిగ్గజ ఐటి కంపెనీలతో పాటు భారతీయ ఐటి నిపుణులను షాక్ కు గురి చేసేదే అని చెప్పొచ్చు. అమెరికా లో ఉన్న పలు దిగ్గజ ఐటి సంస్థలతో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన కంపెనీల్లో ఎంతో మంది భారతీయులు సీఈఓ లు గా ఉన్నారు. వాటిని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఏ కంపెనీ ఆయినా..దేశం ఆయినా తమకు ఉపయోగపడే మానవ వనరులను ఎంచుకుంటారు తప్ప...వాళ్ళ ప్రాంతాలను బట్టి కాదు అనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఐటి రంగం ప్రగతిలో ఇండియన్స్ పాత్ర ఎంతో ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే.

అమెరికన్లతో పోలిస్తే ఇండియన్స్ ఎక్కువ కస్టపడి పనిచేయటంతో పాటు స్థానికులకు ఇచ్చే వేతనాలతో పోలిస్తే ఇండియన్స్ కు ఇచ్చే వేతనాలు ఎంతో తక్కువ ఉంటాయి. ఈ విషయంలో కంపెనీ లు తమ ఆర్థిక లెక్కల ప్రకారమే ముందుకు వెళతాయి. మరో వైపు అమెరికన్స్ అయితే పక్కా టైం టూ టైం పని చేస్తారు తప్ప...అదనపు పని చేయటానికి ఏ మాత్రం ఇష్టపడరు అని...అదే ఇండియన్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు మాత్రం తాము పని చేసే కంపెనీ విషయంలో ఎంతో ఉదారంగా ఉంటారు అని ఒక ఐటి నిపుణుడు వెల్లడించారు. వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఐటి రంగంలోని నిపుణులను కలవరానికి గురి చేసేదిలా ఉంది అనే చెప్పొచ్చు.

అమెరికా లోని దిగ్గజ ఐటి సంస్థలు కొన్ని అమెరికాలో ఉదారమైన ప్రయోజనాలను పొందుతూ చైనాలో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయని మండిపడ్డారు. వీళ్ళు భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండు ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఇక్కడి ప్రజల అవసరాలను పట్టించుకోకపోవటం...నిర్లక్ష్యం చేయటం వంటి పనులు చేశారు అని...తన పాలనతో అలాంటి రోజులు ముగిసిపోయాయి అని గుర్తించాలన్నారు. డోనాల్డ్ ట్రంప్ ప్రధానంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ ను టార్గెట్ గా చేసుకుని ఈ కామెంట్స్ చేసినట్లు కనిపిస్తోంది. వాషింగ్టన్ లొ జరిగిన ఏఐ సమ్మిట్ కు హాజరైన పలు అమెరికా టెక్ కంపెనీలను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఇక ఆ రోజులు ముగిసిపోయినట్టేనని చెప్పిన ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో గెలవడానికి దేశభక్తి కావాలన్నారు. ఏఐ రంగంలో అమెరికాను మొదటి స్థానంలో ఉంచాలని టెక్ కంపెనీలను ట్రంప్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో విజయం సాధించడానికి సిలికాన్ వ్యాలీ లోపల, వెలుపల కొత్త దేశభక్తి, జాతీయ విధేయత అవసరమని ట్రంప్ సూచించారు.

Next Story
Share it