గుడ్లగూబల ప్రీవెడ్డింగ్ షూట్!
BY Admin20 Jan 2022 2:15 PM IST
X
Admin20 Jan 2022 2:15 PM IST
ప్రకృతిలో ఎన్నో అరుదైన సన్నివేశాలు కన్పిస్తుంటాయి. కొంత మంది మాత్రమే వీటిని చాకచక్యంగా ఫోటోల్లో బంధించగలరు. అలాంటి వాటికి ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది. అలాంటిదే ఈ సన్నివేశం. రెండు గుడ్లగూబలు. ముద్దుపెట్టుకునే సన్నివేశాలు. ఆ సన్నివేశానికి సంబంధించిన వరస ఫోటోలు. ఆ ఫోటోలను ఓ ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే..అవి వైరల్ గా మారాయి.
అయితే ఈ ఫోటోలను క్లిక్ అన్పించింది మాత్రం అశ్విన్ కెంకరే. మహారాష్ట్రలోని బాంద్రాలో ఈ సన్నివేశం కంటపడింది. ఈ గుడ్లగూబల ముద్దు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. గుడ్లగూబలకు కూడా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఉంటే ఇలాగే ఉంటుందేమో అంటూ క్యాప్షన్ తో వీటిని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మధుమిత ట్విట్టర్ లో షేర్ చేశారు.
Next Story