Telugu Gateway
Top Stories

భారీగా పెరిగిన ఓటిటి ప్రేక్షకులు

భారీగా పెరిగిన ఓటిటి ప్రేక్షకులు
X

దేశంలో ఓటిటి మార్కెట్ ఒక్కసారిగా పెరగటానికి కారణం అంటే ఖచ్ఛితంగా కరోనా గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే రెండేళ్ల పాటూ లాక్ డౌన్లు, వర్క్‌ ఫ్రం హోమ్‌ వంటి కారణాలతో చాలా మంది ఓటిటి కి బాగా అలవాటు అయ్యారు. ఈ దెబ్బకే చాలాకాలం పాటు థియేటర్లు తెరిచినా కూడా సినీ అభిమానులు అటు వైపు చూడలేదు. ఇప్పటికి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం కంటే ఓటి టి లో వచ్చినపుడు చూసుకుందాంలే అనే అభిప్రాయంతో ఉన్నారు. కాకపోతే థియేటర్ ఫీల్ ఆ సినిమా కు తప్పనిసరి అంటే తప్ప చాలా మంది అటు వైపు ఫోకస్ పెట్టడం లేదు కూడా. దీనికి అడ్డగోలుగా పెంచిన టికెట్ రేట్ల తో పాటు మల్టీప్లెక్స్ ల్లో తినుబండారాల రేట్లు కూడా మరో కారణం.

వీటి అన్నిటి కారణంగా దేశంలో ఓటిటి ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. అంతకు ముందు ఏడాది తో పోలిస్తే ఈ సంఖ్యలో 20 శాతం మేర పెరిగి 424 మిల్లియన్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఓటి టి ప్రేక్షకుల సంఖ్య 353.2 మిలియన్లుగా ఉంది. ఓర్మాక్స్ ఓటిటి నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. దేశ జనాభాలో 30 శాతం ప్రజలకు ఓటిటి లు చేరువ అయ్యాయని ఈ నివేదిక తెలిపింది. అయితే 119 మిల్లియన్ల మాత్రమే యాక్టీవ్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారని తెలిపారు. కొంత మంది మాత్రం సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్ వీ ఓ డీ ) మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Next Story
Share it