అందరి కళ్ళు ఈ ఐపీఓ పైనే
ఎన్ టిపీసి గ్రీన్ ఎనర్జీ ఐపీఓ నవంబర్ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంది. ఐపీఓ కోసం కంపెనీ ముంబై తో పాటు విదేశాల్లో ముఖ్యంగా సింగపూర్ లో కూడా రోడ్ షో లు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఎన్ టిపీసి గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సూపర్ డూపర్ హిట్ కావటం ఖాయం అని చెప్పొచ్చు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో విండ్, సోలార్ ప్రాజెక్ట్ లు కలిగి ఉన్న ఎన్ టిపీసి గ్రీన్ ఎనర్జీ మహారత్న హోదా కలిగి ఉంది. 2024 ఆగస్ట్ నాటికీ కంపెనీ 3071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్స్, 100 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ లు కలిగి ఉంది. రాబోయే సంవత్సరాల్లో కంపెనీ తన సామర్ధ్యాలను పెద్ద ఎత్తున పెంచుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.