Telugu Gateway
Top Stories

నవంబర్ 19 నుంచి ప్రారంభం

నవంబర్ 19 నుంచి ప్రారంభం
X

మరో బిగ్ ఐపీవో కు రంగం సిద్ధం అయింది. ప్రభుత్వ రంగ కంపెనీ ఎన్ టిపీసికి చెందిన అనుబంధ సంస్థ అయిన ఎన్ టిపీసికి గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19 న ప్రారంభం అయి...22 న ముగియనుంది. ఎన్ టిపీసి గ్రీన్ ఎనర్జీ ఈ ఐపీవో ద్వారా పదివేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సమీకరించనుంది. షేర్ల ప్రైస్ బ్యాండ్ ను 102 -108 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఐపీవో లో ఇన్వెస్టర్లు ఒక్కో లాట్ గా కనీసం 138 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ షేర్లు నవంబర్ 27 న బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లో నమోదు కానున్నాయి. గత కొద్ది నెలల్లోనే మార్కెట్ లోకి వచ్చిన అతి పెద్ద ఐపీవోల్లో ఇది ఒకటి. హ్యుండయ్ మోటార్ ఇండియా 27870 కోట్ల రూపాయలు... స్విగ్గీ 11300 కోట్ల రూపాయలు ఐపీవో ద్వారా సమీకరించాయి.

ఇప్పుడు ఎన్ టిపీసి గ్రీన్ ఎనర్జీ పది వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. కంపెనీ మొత్తం ఫ్రెష్ గా షేర్లు జారీ చేస్తోంది. ఇందులో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ లేదు. అయితే ఈ ఐపీవో లో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం పది శాతం షేర్లు మాత్రమే కేటాయించారు. అత్యధిక షేర్లు అంటే 75 శాతం మేర సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం రిజర్వు చేశారు. ఉద్యోగులకు మాత్రం ఒక్కో షేర్ పై ఐదు రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎన్ టిపీసికి గ్రీన్ ఎనర్జీ ఐపీవో కు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it