Telugu Gateway
Top Stories

లిస్టింగ్ ఎప్పుడు అంటే!

లిస్టింగ్ ఎప్పుడు అంటే!
X

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) దేశంలోనే అతి పెద్ద ఎక్స్ఛేంజ్. ముఖ్యంగా ట్రేడింగ్ వాల్యూమ్, మార్కెట్ టర్నోవర్ పరంగా ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీవో వివరాలు శుక్రవారం నాడు బహిర్గతం అయ్యాయి. ఐపీవో కోసం ఎన్ఎస్ఈ ధరల శ్రేణిని 1700 -1785 రూపాయలుగా నిర్ణయించారు. ఐపీవో ద్వారా సంస్థ మొత్తం మార్కెట్ నుంచి 22562 కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఈ లెక్కన సంస్థ మార్కెట్ క్యాప్ 4 .42 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 17 న మొదలు అయ్యే ఈ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 21 న ముగుస్తుంది. మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద ఈ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో దరఖాస్తుదారు కనీసం ఎనిమిది షేర్లకు దరఖాస్తు చేయాల్సింది ఉంటుంది. షేర్ ముఖ విలువ ఒక రూపాయి. ఎన్ఎస్ఈ షేర్లు సెప్టెంబర్ 24 న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

బిఎస్ఈ లో ఈ షేర్లు నమోదు కానున్నాయి. ఎన్ఎస్ఈ లో ప్రసుతం పది మంది షేర్ హోల్డర్లు ఉండగా...ఇందులో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎంఎస్ స్ట్రాటజిక్ (మారిషస్), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు, ఆర్నాడా ఇన్వెస్ట్మెంట్స్ (మారిషస్) వంటి సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి తొలుత ఎన్ఎస్ఈ ఐపీవో దేశంలోనే ఇప్పటి వరకు వచ్చిన వాటిలో అతి పెద్ద ఐపీఓ గా నిలుస్తుంది అని భావించారు. దీనికి కారణం ఈ సంస్థ మార్కెట్ నుంచి 30000 కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉంది అని మీడియా లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇష్యూ సైజు ను 22562 కోట్ల కు పరిమితం చేయటంతో

హ్యుండయ్ మోటార్ ఇండియా ఐపీవో నే దేశంలో అతి పెద్ద ఐపీవో గా నిలవనుంది. రిలయన్స్ జియో ఐపీవో వచ్చిన తర్వాత మాత్రం ఇది రెండవ స్థానానికి పరిమితం కానుంది. రిలయన్స్ జియో ఐపీవో దసరా..డీపావళి మధ్య వచ్చే అవకాశం ఉంది.

Next Story
Share it