Telugu Gateway
Top Stories

రియల్ ఎస్టేట్ లో పెరిగిన ఎన్ఆర్ఐ పెట్టుబడులు

రియల్ ఎస్టేట్ లో పెరిగిన ఎన్ఆర్ఐ పెట్టుబడులు
X

ప్రపంచం అంతటా కోవిడ్ కల్లోలం కొనసాగుతున్నా భారత రియల్ ఎస్టేట్ లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) పెట్టుబడులు మాత్రం పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో దేశంలోకి ఎన్ఆర్ఐ పెట్టుబడులు 13.3 బిలియన్ డాలర్లు వచ్చినట్లు ఓ నివేదిక వెల్లడించింది. గత ఆర్ధిక సంవత్సరం కంటే ఇది 6.4 శాతం మేర అధికం. కోవిడ్ 19 కారణంగా మార్కెట్ సెంటిమెంట్ డల్ గా ఉన్నా కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెరగటం విశేషం.. అయితే దీనికి పలు కారణాలను వారు ఉదహరిస్తున్నారు. ఆకర్షణీయమైన చెల్లింపు ప్రణాళికలు ఉండటంతోపాటు గృహ రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గటం కూడా కలిసొచ్చిందని చెబుతున్నారు.

ఎవరూ ఊహించని రీతిలో కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తో పాటు స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగానే మార్కెట్లు ఎన్నో కొత్త కొత్త రికార్డులను నమోదు చేశాయి. కరోనా కారణంగా పలు వ్యాపారాలు దెబ్బతినటం...ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో ఎక్కువ మంది తమ దగ్గర నిధులను అటు రియల్ ఎస్టేట్ తోపాటు కొంత మంది స్టాక్ మార్కెట్ కు కూడా తరలించారు. ఈ కారణంగానే ఆయా మార్కెట్లలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి.

Next Story
Share it