Telugu Gateway
Top Stories

ప్రపంచం లో రోజుకు ఎన్ని సెల్ఫీ లు దిగుతారో తెలుసా?!

ప్రపంచం లో రోజుకు ఎన్ని సెల్ఫీ లు దిగుతారో తెలుసా?!
X

సెల్ఫీ. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసిన విద్య ఇది. ఒకప్పుడు ఫోటో దిగాలంటే అబ్బో చాలా కష్టాలే ఉండేవి. స్టూడియో కి వెళ్ళాలి...ఫోటో దిగాలి...కొన్ని గంటల తరువాతః కానీ...ఆ ప్రింట్ ఇవ్వరు. ఇప్పుడు అసలు ఫోటోల కథే పూర్తిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సినిమా కు పోయినా..రెస్టారెంట్ కు పోయినా...చివరకు షాపింగ్ కు పోయినా క్షణాల్లో ఫోటో అదే...సెల్ఫీ తీసుకోవటం...ఆ వెంటనే వాటిని అటు పేస్ బుక్, ఇటు ఇన్‌స్టాగ్రామ్ లో అప్డేట్ చేయటం. సెలెబ్రిటీల దగ్గర నుంచి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఇది. అసలు పేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు ఇన్ని ఫోటోల డేటా ను ఎలా మేనేజ్ చేస్తున్నాయా అన్న సందేహం కూడా రాక మందు. పేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో ఫోటో అప్ లోడ్ చేయటం ఫ్రీ కనుక చాలా మంది ఒక్కసారి పదుల సంఖ్యలో కూడా ఫోటోలు పెట్టేస్తారు. అందుకేనేమో ఈ లెక్క మరీ అంత దారుణంగా ఉంది. అది ఏంటి అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు దిగే సెల్ఫీల సంఖ్య 9 .2 కోట్లుగా ఉంటాయి అని ఒక అంచనా. అమెరికాకు చెందిన కార్ని లియోస్ తొలుత 1839 లో మొదటి సెల్ఫీ తీసుకున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. 30 సంవత్సరాల వయస్సు ఉన్న అయన ఫిలడెల్పియా గ్యాస్ లైటింగ్ బిజినెస్ సంస్థ వద్ద ఒక్కడే నిలబడి సెల్ఫీ దిగారు.

అంటే ఈ డిజిటల్ ఫోన్లు అందుబాటుకుకి చాలా ముందు నుంచే సెల్ఫీ ఉంది అని చెపుతున్నారు. సెల్ఫీ తీసుకునే సమయంలో అరవై శాతం మంది నవ్వుతుంటే...మిగిలిన వాళ్ళు మాత్రం రొటీన్ అలా తీసుకుని వదిలేస్తున్నారు. సెల్ఫీ ల కారణంగా ప్రతి ఏటా ప్రమాదాల్లో 43 మంది చనిపోతున్నట్లు అంచనా. 2013 సంవత్సరంలో సెల్ఫీ అనే పదం వర్డ్ అఫ్ ది ఇయర్ గా నిలిచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లో చోటు దక్కించుకుంది. మార్చి 16 ను ప్రపంచ వ్యాప్తంగా నో సెల్ఫీ డే గా పాటిస్తారు. అయితే ఇది అమెరికా లో మాత్రమే ఈ సెల్ఫీ డే అమలులో ఉంది. చాలా మందికి ఈ సెల్ఫీ లు ఒక పిచ్చిగా మారిపోయిన విషయం తెలిసిందే. కొంత మందికి అసలు సెల్ఫీ లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. మొబైల్స్ చాలా మంది ఎలా అడిక్ట్ అవుతున్నారు...అలాగే మరికొంత మంది సెల్ఫీ ల విషయం లో కూడా అలాగే అడిక్ట్ అవుతున్నారు. మన దగ్గర కూడా ఎవరైనా నో సెల్ఫీ డే ను పాటించమని చెపితే ఆ రోజు మరీ ఎక్కువ సెల్ఫీ లు దిగుతారు తమలో ఎలాంటి సందేహం లేదు. ఏమైనా రోజుకు ప్రపంచ వ్యపథంగా తొమ్మిది కోట్ల పైన సెల్ఫీ లు అంటే మాములు విషయం కాదు.

Next Story
Share it