Telugu Gateway
Top Stories

దేశంలోనే అతి పెద్ద ఐపీవో

దేశంలోనే అతి పెద్ద ఐపీవో
X

రిలయన్స్ ఇన్వెస్టర్లు...మార్కెట్ ఎప్పటి నుంచో ఆసక్తి గా ఎదురుచూస్తున్న జియో ఫ్లాట్ ఫార్మ్స్ ఐపీవో ప్రకటన వెలువడింది. దేశంలోనే ఇది అతి పెద్ద ఐపీఓగా కూడా నిలవనుంది. మార్కెట్ నుంచి ఈ కంపెనీ దగ్గర దగ్గర 38000 కోట్ల రూపాయల మేర సమీకరించనుంది. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే జియో ఫ్లాట్ ఫార్మ్స్ ఐపీవో వస్తున్నా దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్స్ కు నేరుగా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తేలిపోయింది. ఈ ఇన్వెస్టర్లకు 2023 లో ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన జియో ఫైనాన్సియల్ షేర్లు ఉచితంగా కేటాయించారు. కానీ ఇప్పుడు అలా రిలయన్స్ ఇన్వెస్టర్లకు తమ ఖాతాల్లో ఎలాంటి జియో షేర్లు ఉచితంగా రావు. అయితే ఈ ఐపీవో ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లకు పరోక్షంగానే లాభం చేకూరనుంది తప్ప...నేరుగా ఎలాంటి లాభం ఉండదు అని తేలిపోయింది. ఎందుకంటే నేరుగా ప్రజలకు కంపెనీ షేర్లు జారీ చేయనుంది. అయితే జియో పబ్లిక్ ఇష్యూ వల్ల జియో ఫ్లాట్ ఫార్మ్స్ అసలు విలువ ఇప్పుడు బయటకు వస్తుంది అని..ఇప్పటి వరకు ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కలిసి ఉండటం వల్ల ఇది తెలియలేదు అన్నది అన్నది మార్కెట్ వర్గాల మాట. ఈ వేల్యూ అన్ లాకింగ్ తో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ లో రీ రేటింగ్ చోటు చేసుకుంటుంది అని...మొత్తం మీద సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను భారీగా పెంచుతుంది.

మరో వైపు మాతృ సంస్థ పై ఆధారపడకుండా ఈ నిధుల సమీకరణ ద్వారా కంపెనీ బాలన్స్ షీట్ ను మెరుగుపరుచుకోవటంతో పాటు భవిష్యత్ విస్తరణకు అవసరం అయిన నిధులు అందుబాటులో ఉంటాయన్నది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు షేర్ హోల్డర్స్ రిజర్వేషన్ కోటాలో జియో ఐపీవో కు అప్లై చేసుకోవచ్చు. ఐపీవో తర్వాత కూడా జియో ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 67 శాతం వాటితో మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. ఇప్పటికే దేశంలో నంబర్ వన్ టెలికాం కంపెనీ గా ఉన్న జియో లాభదాయకత తదితర అంశాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎర్నింగ్ పర్ షేర్ (ఈపీఎస్) లో ప్రతిఫలిస్తుంది అని చెపుతున్నారు. అయితే నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు ఎలాంటి షేర్లు రావనే వార్త మాత్రం ఎక్కువ మంది ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది అనే చెప్పాలి.

Next Story
Share it