Telugu Gateway
Top Stories

దేశ వ్యాప్త లాక్ డౌన్ ఉండదు

దేశ వ్యాప్త లాక్ డౌన్ ఉండదు
X

కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఉత్తమ విధానం

ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్త లాక్ డౌక్ కు ఛాన్సేలేదన్నారు. కరోనా నియంత్రణకు రాత్రి కర్ఫ్యూ ఓ ప్రత్యామ్నాయం అన్నారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడవద్దని అన్నారు. రాష్ట్రాలు అన్నీ కరోనా టెస్ట్ లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చాలా రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేదని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు జాము వరకూ కర్ఫ్యూ పెడితే మంచిది అన్నారు. రాత్రి కర్ఫ్యూను కరోనా కర్ఫ్యూగా పిలుద్దామని సూచించారు.

ప్రజలు కరోనాను సీరియస్ గా తీసుకోవటం లేదన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ ఘడ్, పంజాబ్ ల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రధాని మోడీ గురువారం రాత్రి దేశంలోని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

Next Story
Share it