Telugu Gateway
Top Stories

వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్

వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్
X

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బీఐ) మార్కెట్ అంచనాలకు బిన్నంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి రేపో లో ఎలాంటి పెంపు లేకుండా అలాగే ఉంచింది. వాస్తవానికి నిపుణులు, మార్కెట్ వర్గాలు ఈ సారి కూడా మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేపో రేట్ పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేశారు. అయితే ఆర్ బీఐ మాత్రం రేపో రేట్ ను 6. 50 శాతం వద్ద అలాగే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో స్టాక్ మార్కెట్ లో ఉత్సహం వచ్చి మార్కెట్ లు లాభాలతో కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ను కట్టడి చేయటానికి రిజర్వు బ్యాంకు వరసగా రేపో రేట్లు పెంచుకుంటూ పోయిన విషయం తెలిసిందే.

ఆర్థిక వృద్ధి మందగించకూడదు అనే ఉద్దేశంతో ఈ సారి మాత్రం రేపో రేట్ జోలికి పోలేదు అని భావిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా రిజర్వు బ్యాంకు ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర రేపో రేట్ పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఇంకా ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉన్నా ఇప్పుడు ఆర్ బీ ఐ ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రభావం పడింది. అది ఇంకా కొనసాగుతూ ఉంది.

Next Story
Share it