కరెన్సీపై కొత్త ఫోటోలు..అలాంటి ప్రతిపాదనలు లేవు
BY Admin6 Jun 2022 10:56 AM

X
Admin6 Jun 2022 2:57 PM
భారతీయ కరెన్సీ నోట్లపై ఒక్క మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే ఉంటుంది. తాజాగా మహాత్మాగాంధీతోపాటు ఎంపిక చేసిన నోట్లపై రవీంద్రనాథ్ ఠాకూర్ తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోలు కూడా రానున్నాయంటూ వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన డిజైన్ వర్క్ అంతా పూర్తయిందని..ఆర్ బిఐ తుది నిర్ణయం తీసుకోవటమే ఆలశ్యం అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై ఆర్ బిఐ వివరణ ఇచ్చింది. అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ తమ దగ్గర లేదని..ఈ వార్తలు నిరాధారం అంటూ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఉన్న నోట్లలో ఎలాంటి మార్పులు చేయటంలేదని స్పష్టం చేసింది.
Next Story