Telugu Gateway
Top Stories

ఇన్‌స్టాగ్రామ్‌ లో విజయ్ ను అన్ ఫాలోతో

ఇన్‌స్టాగ్రామ్‌ లో విజయ్ ను  అన్ ఫాలోతో
X

తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయ్ ఎంత సంచలనం సృష్టించారో...హీరోయిన్ త్రిష పేరు కూడా అంత సంచలనంగా మారింది. దీనికి ప్రధాన కారణం తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ నైనర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలే. విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పటిలో పెద్ద ఎత్తున దుమారం రేపటంతో ఆ తర్వాత నాగేంద్రన్ క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఇది ఎన్నికల ముందు వివాదం అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయ్ స్థాపించిన టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించటంతో మరో సారి త్రిష పేరు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. విజయ్ ఆమెను కేబినెట్ లోకి తీసుకుంటారు ..విజయ్ రాజీనామా చేసే తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తారు అంటూ కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూరు తో పాటు తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు.

తర్వాత సీఎం విజయ్ తిరుచ్చి ఈస్ట్ సీట్ వదులుకున్నారు . ఈ సీటు నుంచి ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఎన్నికల ముందు...తర్వాత కూడా విజయ్, త్రిష పలు కార్యక్రమాల్లో కలిసి పాల్గొనటంతో పాటు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల వరకు ఇద్దరూ సన్నిహితంగా ఉంటూనే వచ్చారు. కానీ సడన్ గా కొన్ని రోజుల నుంచి విజయ్, తన భార్య సంగీత లు కలిసిపోయే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. వాస్తవానికి వీళ్ళిద్దరూ విడాకుల కోసం కోర్ట్ లో పిటిషన్ కూడా వేసి ఉన్నారు. విజయ్ సీఎం అయిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న పరిణామాల్లో విజయ్, సంగీత తిరిగి కలిసి ఉండబోతున్నారు అనే వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇదే నిజం అనే సంకేతాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా విజయ్ పుట్టినరోజున త్రిష ఎలాంటి శుభాకాంక్షలు చెప్పకుండా సైలెంట్‌గా ఉండటం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. విజయ్, సంగీత జంట తమ మనస్పర్థలను వీడి మళ్లీ కలిసిపోనున్నారనే వార్తల వల్లే త్రిష విజయ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా త్రిష తాజాగా తమిళనాడి సీఎం విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌ లో అన్ ఫాలో చేయటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. కోలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న ఆన్‌స్క్రీన్ జోడీల్లో దళపతి విజయ్, త్రిషల జంట ఒకటి. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి ఎంతటి ఆదరణ ఉందో, నిజ జీవితంలోనూ వీరి మధ్య ఉన్న బాండింగ్ గురించి సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువే ఊహాగానాలు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకూ విడాకుల తర్వాత విజయ్-త్రిష పెళ్లి పీటలెక్కనున్నారన్న వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. ఈ కారణంగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుపొందగానే చాలామంది సెలబ్రెటీలు, నెటిజన్లు త్రిషకు విషెస్ చెప్పడం, ఫలితాల రోజు ఆమె విజయ్ ఇంటికి వెళ్లడంతో వీరి మధ్య బంధం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయింది.

Next Story
Share it