నితీష్ కుమార్..బిజెపి నామినేటెడ్ సీఎం
BY Admin16 Nov 2020 8:24 PM IST
X
Admin16 Nov 2020 8:24 PM IST
బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే నితీష్ కుమార్ పై పంచ్ లు పడుతున్నాయి. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ కూడా నితీష్ పై వ్యంగాస్త్రాలు సంధిస్తోంది. బిజెపి నేతలు ఏడ్చి ఏడ్చి అడిగితేనే సీఎం బాధ్యతలు చేపట్టానికి నితీష్ కుమార్ అంగీకరించారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ఒకప్పటి సన్నిహితుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా నితీష్ కుమార్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.
సీఎంగా ఎన్నికైన నితీష్‌ను ఓ వైపు అభినందిస్తూనే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'బీజేపీ నామినేటేడ్ ముఖ్యమంత్రి నితీష్‌కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి (నితీష్) పాలనను భరించేందుకు బీహార్ ప్రజలు మరో కొనేళ్ల పాటు సిద్ధంగా ఉండాలి' అంటూ సోమవారం ట్వీట్ చేశారు.
Next Story