Telugu Gateway
Top Stories

నీతా అంబానీ పన్నెండు కోట్ల కారు ఇదే

నీతా అంబానీ పన్నెండు కోట్ల కారు ఇదే
X

ముఖేష్ అంబానీ. దేశం లో నంబర్ వన్ సంపన్నుడు. అయన సంపద మొత్తం దగ్గర దగ్గర 118 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో అయితే 979400 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అనుకుంటున్నారా?. సోషల్ మీడియా లో తాజాగా ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. అదేంటి అంటే ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ 12 కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు కొన్నారు. ఈ ఫోటో లే ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే గత ఏడాదే ముఖేష్ అంబానీ దీపావళి సమయంలో పది కోట్ల రూపాయల ఖరీదు అయిన రోల్స్ రాయిస్ కారు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఆమె 12 కోట్ల రూపాయలు పెట్టి...పూర్తిగా తన అవసరాలు..సూచనలకు అనుగుణంగా ఈ విలాసవంతమైన కారు ను సిద్ధం చేయించుకున్నారు.

ముకేశ్ అంబానీ కి చెందిన నివాసం అంటిలియా దేశంలోనే అత్యంత సంపన్న నివాసం . దీని విలువ 15000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఒక్క దేశంలోనే కాదు..ప్రపంచంలో కూడా ఇది అత్యధిక ఖరీదైన ఇళ్ల జాబితాలో నిలుస్తుంది. భారీ కాన్వాయ్ తో ముంబైలో తిరుగుతున్నఈ ఖరీదైన కారు వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. దేశంలో అతి తక్కువ మంది దగ్గర మాత్రమే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు ఉంటాయి. ఆటోమొబైల్ ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో ఇవి ముందు వరసలో ఉంటాయనే చెప్పాలి.

Next Story
Share it