Telugu Gateway
Top Stories

'తానా' కొత్త అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్

తానా కొత్త అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్
X

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో తానా త‌దుప‌రి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానలే పూర్తి ఆధిక్యత కనపర్చింది. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్‌ కొడాలికి 9,108 ఓట్లు వ‌చ్చాయి.

ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యం క‌న‌బ‌రిచిన నిరంజ‌న్ ప్యానెల్ చివ‌రికి భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజ‌యంతో నిరంజన్‌ ప్యానెల్‌ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. శృంగవరపు నిరంజన్‌కు తానా ప్ర‌స్తుత అధ్యక్షుడు జ‌యశేఖ‌ర్‌ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతుగా నిలిచారు.

Next Story
Share it