Telugu Gateway
Top Stories

జాబ్ మార్కెట్ లో కీలక మార్పులు

జాబ్ మార్కెట్ లో కీలక మార్పులు
X

ఇప్పటికే నిరుద్యోగ సమస్య ప్రపంచ వ్యాప్తంగా యువతను వెంటాడుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాలు రాబోతుండగా....పోయే ఉద్యోగాలు మాత్రం 8 .3 కోట్ల ఉద్యోగాలు ఉండబోతున్నాయి. దీంతో నికరంగా 1 .4 కోట్ల ఉద్యోగాలు మాయం కానున్నాయి. ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యుఈఎఫ్ ) అంచనా వేసింది. ఫ్యూచర్ అఫ్ జాబ్స్ రిపోర్ట్ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం మీద చూస్తే నికర ఉద్యోగాలు తగ్గుముఖం పడతాయని ఈ నివేదిక తేల్చింది. కొత్తగా..శరవేగంగా దూసుకొస్తున్న ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పాటు ఆటోమేషన్ వంటి అంశాలు కూడా ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడానికి కారణం కాబోతున్నాయి.

వీటితో పాటు ద్రవ్యోల్బణం, సప్లై సమస్యలు వంటికి కూడా ప్రధాన కారణంగా ఉండే అవకాశం ఉంది అని అంచనా వేశారు. వచ్చే ఐదేళ్లలో 75 శాతం కంపెనీలు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ , ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక తను సమకూర్చుకోనున్నాయి. ప్రధానంగా విద్య, వ్యవసాయం, డిజిటల్ కామర్స్, వాణిజ్య రంగాల్లో మాత్రం కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మరో కీలక అంశం ఏమిటి అంటే వచ్చే ఐదేళ్లలో 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు కాలం చెల్లుతుంది అని పలు కంపెనీల యాజమాన్యాలు వెల్లడించాయి. వీరిలో ఎంత మంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని కంపెనీల అవసరాలకు అనుగుణంగా రెడీ అవుతారు అన్నది ఇప్పుడు మరో సవాలుగా మారబోతుంది.

Next Story
Share it