Telugu Gateway
Top Stories

గోవాలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు లేవు

గోవాలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు లేవు
X

కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరికి వాళ్ళు న్యూ ఇయర్ వేడుకల ప్లాన్స్ లో ఉన్నారు. కొత్త ఏడాదికి చాలామంది గోవా బాట పడుతుంటారు. ఎందుకంటే గోవా అంటేనే హంగామా...హడావుడి. ముఖ్యంగా యువత గోవా లో కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని కోరుకుంటుంది. ఈ దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. అలాంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అంటే జనవరి 2 వరకు రాష్ట్రంలో ఎలాంటి కరోనా ఆంక్షలు ఉండబోవని గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. జనవరి 3 న సమావేశం పెట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

అయితే ప్రజలు తమంతట తాము కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో గోవా నూతన సంవత్సర వేడుకలకు పూర్తి స్థాయిలో సిద్ధం అవుతోంది. ఈ ఏడాది అంటే న్యూ ఇయర్ వేడుకలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారని సర్కారు అంచనా వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణికులను రాండమ్ గా చెక్ చేస్తున్నారు. చైనా తో పాటు అమెరికా తదితర దేశాల్లో మళ్ళీ కరోనా కొత్త కేసు లు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం అన్నీ రాష్ట్రాలను అపప్రమత్తం చేసింది. ఈ తరుణంలో గోవా లో వేడుకలకు అనుమతి ఉంటుందా...ఉండదా అనే అనుమానాలు వచ్చాయి చాలా మందిలో. వీటికి తెర దించేందుకు సీఎం ప్రమోద్ సావంత్ ఈ మేరకు ప్రకటన చేశారు.

Next Story
Share it