Telugu Gateway
Top Stories

డబ్ల్యూహెచ్ వో ది అదే మాట

డబ్ల్యూహెచ్ వో ది అదే మాట
X

బ్రిటన్ లో రూపుమారిన కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) స్పందించింది. ఈ కొత్త వైరస్ అదుపు తప్పలేదని తేల్చింది. ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలే మరింత జాగ్రత్తగా పాటించాలని తెలిపారు. రూపాంతం చెందిన ఈ కొత్త వైరస్ బ్రిటన్ తోపాటు మరో నాలుగైదు దేశాలకు విస్తరించినట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్ వో అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖేల్ ర్యాన్ తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలే దీనికి అనుసరిస్తే సరిపోతుందని తెలిపారు. దీని ద్వారానే వైరస్ ను నియంత్రించవచ్చని పేర్కొంది.

గతంలో జరిగిన వ్యాప్తితో పోలిస్తే ఇది అంత స్థాయిలో లేదని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పకపోవచ్చని హెచ్చరించింది. కొత్త వైరస్ బ్రిటన్ లో విస్తరించిందనే కారణంతో ఆ దేశం నుంచి వచ్చే విమానాలను భారత్ తో సహా పలు దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే వైద్య నిపుణులు అందరూ రూపుమారిన వైరస్ పెద్ద ప్రమాకరమేమీ కాదని..అయితే అది ఎక్కువ మందికి సోకితే సమస్యగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it