Telugu Gateway
Top Stories

నజారా సూపర్ లిస్టింగ్..వెంటనే 20 శాతం మైనస్

నజారా సూపర్ లిస్టింగ్..వెంటనే 20 శాతం మైనస్
X

ప్రముఖ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్ షేర్ మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఐపీవో ధర 1101 రూపాయలు అయితే ఏకంగా 1990 రూపాయల వద్ద లిస్ట్ అయింది. అయితే ఆ వెలుగులు ఎంతో కాలం నిలబడలేదు. సూపర్ లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు వెంటనే అమ్మకాలకు దిగటంతో తొలి రోజే 20 శాతం లోయర్ సర్కూట్ ను తాకింది. అయితే లిస్టింగ్ ధరతో పోలిస్తే 20 శాతం లోయర్ సర్కూట్ ను తాకినా ఐపీవో తో పోలిస్తే లాభాల్లో ముగిసినట్లే. తొలి రోజు బీఎస్ఈలో 8.37 లక్షల షేర్ల లావాదేవీలు జరిగాయి. కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి 583 కోట్ల రూపాయలు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు రాగా..ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో ఐపీవో ఏకంగా 175 సార్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది.

దేశంలోని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జునుజున్ వాలా కు ఇందులో 10.82 శాతం వాటా ఉంది. లిస్టింగ్ ధర ప్రకారం చూస్తే ఈ వాటా విలువ 656 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. దేశీయ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తొలి గేమింగ్ కంపెనీగా నజారా టెక్నాలజీస్ నిలిచింది. ఈ కంపెనీనే క్యాండీక్రష్, సబ్ వే సర్ఫర్, టెంపుల్ రన్ వంటి ప్రముఖ గేమ్ లను రూపొందించింది ఈ సంస్థే. రాబోయే రోజుల్లో గేమింగ్ రంగానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందనే అంచనాల మధ్య ఈ షేర్లకు మంచి ఆదరణ లభించింది.

Next Story
Share it