Telugu Gateway
Top Stories

ప్రాంతీయ భాషల్లోనూ ఎన్ఎస్ఈ వెబ్ సైట్స్

ప్రాంతీయ భాషల్లోనూ ఎన్ఎస్ఈ వెబ్ సైట్స్
X

న్ఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహన్

తలసరి ఆదాయం మన కంటే ఎక్కువగా ఉన్న పలు కీలక దేశాల్లో కూడా భారత్ లో ఉన్న మెరుగైన స్టాక్ మార్కెట్ వ్యవస్థలు లేవు అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహన్ వెల్లడించారు. అక్కడక్కడ కొన్ని నియంత్రణలను ఉల్లంఘిస్తున్నాసెబీ వంటి నియంత్రణా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి అని వెల్లడించారు. అసలు తప్పులు జరగకుండా ఏ వ్యవస్థ ఉండదు అని...సినిమాల్లో కూడా ప్రతి చోటకూ పోలీస్ లు నేరం జరిగిన తర్వాతే వస్తారు కానీ...ముందే అక్కడ ఉండి వాటిని ఆపలేరు అని వ్యాఖ్యానించారు. అలాగే మార్కెట్లో కూడా తమ దృష్టికి వచ్చిన విషయాలను ఎప్పటికప్పుడు నియంత్రణ సంస్థల కు తెలియచేస్తామన్నారు. అతి తక్కువ పెట్టుబడితో కంపెనీల్లో భాగస్వాములు అయ్యేందుకు స్టాక్ మార్కెట్ ఎంతో మెరుగైన విధానం అన్నారు. అయితే ఎవరో చెప్పిన మాటలు...సలహాలు ..సూచనలు కాకుండా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అని తెలిపారు. అందుకే ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్లను ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం అని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో స్టాక్ మార్కెట్ లు కీలక భూమిక పోషిస్తున్నాయని ఆశిష్ కుమార్ చౌహన్ తెలిపారు. స్టాక్ మార్కెట్ వివరాలు ఎక్కువ ఇంగ్లీష్ లోనే ఉంటాయనే విషయం తెలిసిందే. దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెబ్ సైట్ లోనూ అన్ని వివరాలు ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఈ సమస్యను తొలగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) అన్ని ప్రాంతీయ భాషల్లో వెబ్ సైట్స్ తీసుకురానుంది.

దీని ద్వారా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి వారి సొంత భాషల్లో వివరాలు తెలుసుకుని పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడుతుంది అని ఆశిష్ కుమార్ చౌహన్ వెల్లడించారు.ఇటీవల ఆయన హైదరాబాద్, వైజాగ్ ల నుంచి ఎన్ఎస్ఈని సందర్శించిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. ఎన్ఎస్ఈ ప్రతి ఏటా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పాటు పలు నూతన టెక్నాలజీలపై 1500 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడుతుంది అని తెలిపారు. ఎన్ఎస్ఈ పలు విభాగాల్లో అగ్ర స్థానంలో ఉంది అని తెలిపారు. భారత్ లో అతి పెద్ద ఎక్స్చేంజ్ కూడా ఎన్ఎస్ఈ నే అని తెలిపారు. అదే సమయంలో ప్రపంచంలోనే ఎన్ఎస్ఈ అతి పెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ గా ఉంది. కాంట్రాక్టు నంబర్ల ట్రేడింగ్ విషయంలో. కరెన్సీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు ల ట్రేడింగ్ లో అతి పెద్ద ఎక్స్చేంజ్ గా కూడా ఎన్ఎస్ఈ నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా తొమ్మిదవ అతి పెద్ద ఎక్స్చేంజ్. త్వరలోనే ఎన్ఎస్ఈ కూడా స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది.



Next Story
Share it