Telugu Gateway
Top Stories

విమానాశ్ర‌యాలు..ఓడ‌రేవులు..రైల్వేల ఆస్తులు ప్రైవేట్ కు

విమానాశ్ర‌యాలు..ఓడ‌రేవులు..రైల్వేల ఆస్తులు ప్రైవేట్ కు
X

మానిటేజైష‌న్ తో ఆరు లక్షల కోట్ల రూపాయ‌ల స‌మీక‌ర‌ణ‌కు నిర్ణ‌యం

కేంద్రం చేతిలో ఉన్న రోడ్లు, రైల్వేలు, విద్యుత్ స‌ర‌ఫ‌రా, విద్యుత్ ఉత్ప‌త్తి, న్యాచుర‌ల్ గ్యాస్ పైప్ లైన్ , టెలికం, వేర్ హౌసింగ్, మైనింగ్, ఏవియేష‌న్, ఓడ‌రేవులు, స్టేడియాల‌కు చెందిన ఆస్తులు ప్రైవేట్ చేతికి వెళ్ళ‌నున్నాయి. అయితే నిర్దేశిత స‌మ‌యం త‌ర్వాత మ‌ళ్లీ అవి ప్ర‌భుత్వానికే తిరిగివ‌స్తాయ‌ని..ఈ ఆస్తుల‌ను బ‌ద‌లాయించ‌టం ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయ‌ల స‌మీక‌రించాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. 2022-25 ఆర్థిక సంవత్సరాల్లో ఈ టార్గెట్ పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ నేడు 'నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్'ను ప్రారంభించారు.

బ్రౌన్‌ఫీల్డ్ ఆస్తులను మాత్రమే మానిటైజ్ చేస్తామని, ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని ఈ సందర్భంగా నిర్మలా సీతారామ‌న్ తెలిపారు. ప్రభుత్వం ఆస్తులను విక్రయించబోదని, నిర్ణీత గడువు తర్వాత వెనక్కి తీసుకుంటామని నిర్మల తెలిపారు. అయితే ఎంత కాలం వీటిని ప్రైవేట్ సంస్థ‌ల‌కు ఇస్తార‌నే అంశంపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. మానిటేష‌న్ కార్య‌క్ర‌మం కింద 15 రైల్వే స్టేడియాలు, 25 విమానాశ్ర‌యాలు, 160 బొగ్గు మైనింగ్ ప్రాజెక్టుల‌ను అప్ప‌గించనున్నారు.

Next Story
Share it