Telugu Gateway
Top Stories

నాలుగు నెలల వయసులోనే 240 కోట్ల ఆస్థి

నాలుగు నెలల వయసులోనే 240 కోట్ల ఆస్థి
X

ఎంత ఉన్నత చదువులు ఉన్నా కూడా ఉద్యోగం చేసి కోటి రూపాయలు సంపాదించటం అంటేనే అంత ఈజీ కాదు. వినూత్న ఆలోచనలు...బిజినెస్ ఐడియా లు ఉన్నా కూడా కొంత మందికి మాత్రమే వేగంగా డబ్బు సంపాదించటం సాధ్యం అవుతుంది. కానీ నిండా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే భారత్ లో ఒక బుల్లి మిలియనీర్ అవతరించాడు. భారత్ లో అత్యంత చిన్న వయసులో మిలియనీర్ గా నిలిచాడు ఆ చిన్నోడు. అతను ఎవరు అనుకుంటున్నారా?. దేశంలోని ప్రముఖ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి . ఏకాగ్రహ్ నారాయణ మూర్తి కొడుకు రోహన్ మూర్తి తనయుడు. నారాయణమూర్తి తన వాటా కింద ఉన్న షేర్ల లో 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను మనవడికి బదలాయించారు.

ఈ విషయాన్ని స్టాక్ మార్కెట్ తెలియచేశారు. వీటి విలువ 240 కోట్ల రూపాయలు ఉంటుంది. దీంతోనే ఏకాగ్రహ్ నాలుగు నెలల వయస్సులోనే మిలియనీర్ గా మారిపోయాడు. ఈ షేర్ల బదలాయింతో ఏకాగ్రహ్ కు ఇన్ఫోసిస్ లో 0 .04 శాతం వాటా దక్కింది. ప్రస్తుతం నారాయణ మూర్తి దగ్గర 1 .51 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి. నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తి భర్త ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ అన్న విషయం తెలిసిందే. అక్షతా మూర్తి కు గత డిసెంబర్ తో ముగిసిన కాలానికి ఇన్ఫోసిస్ లో 1 .05 శాతం వాటా ఉంది. అలా పుట్టీ పుట్టగానే మిలియనీర్..బిలియనీర్లు కావాలంటే ఇలాంటి కుటుంబాల్లోని సాధ్యం అవుతుంది.

Next Story
Share it