Telugu Gateway
Top Stories

అది వర్క్ అవుట్ కాదులే !

అది వర్క్ అవుట్ కాదులే !
X

ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీనికి అయన కౌంటర్ ఇస్తూ అమెరికా లో ఇలాంటివి ముందుకు సాగవు అంటూ వ్యాఖ్యానించారు. ఎలాన్ మస్క్ గాడితప్పినట్లు కనిపిస్తోంది అని..కొత్త పార్టీ ప్రకటన హాస్యాస్పదం అంటూ ట్రంప్ దీన్ని తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేశారు. తమ ఇద్దరి మధ్య బంధాన్ని దారుణంగా ముగించే స్థితికి వాతావరణం వచ్చింది అని...గత ఐదు వారాలుగా ఎలాన్ మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారు అని ఆరోపించారు. అమెరికా లో మూడవ పార్టీ అనేది వియవంతం కాదు అని..ఇలాంటి వాటిని దేశ ప్రజలు ఆమోదించరు అన్నారు. మూడవ పార్టీ గందరగోళానికి..ఘర్షణలకు తావు ఇస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వెంటనే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని ఎలాన్ మస్క్ కోరుకుంటున్నారు అని...దీన్ని తాను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అందుకే బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు.

అమెరికా ప్రజలను రక్షించటం కోసమే ఈ బిల్లు తెచ్చినట్లు ప్రకటించారు ట్రంప్. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త పార్టీ ప్రకటిస్తాను అని చెప్పిన మస్క్ చెప్పినట్లే పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమెరికాను నష్టాలలోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటుంది అంటూ పార్టీ ప్రకటన సందర్భంగా ఎలాన్ మస్క్ తన ఎక్స్ లో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. మీ స్వేచ్ఛను మళ్లీ మీకు అందించడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అన్నారు. డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ లు కొన్ని నెలల క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్స్‌లాగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డాడు. భారీ ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరి మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి.

Next Story
Share it