Telugu Gateway
Top Stories

ముంబై లో 110 అంతస్తుల మెగా టవర్!

ముంబై లో 110 అంతస్తుల మెగా టవర్!
X

దేశం లో ఎత్తైన భవనాల నిర్మాణం అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా?. అది 1959 లో చెన్నైలో ప్రారంభం అయింది. అది కూడా 12 అంతస్తులతో. ఇదే ఎల్ఐసి బిల్డింగ్. దేశంలోని తొలి ఎత్తైన భవనం అదే. 1961 సంవత్సరం వరకు ఇది ఉండేది. కానీ ముంబై లో 1961 లో ఉషా కిరణ్ బిల్డింగ్ రావటంతో అది టాప్ లో నిలిచింది. ప్లైస్ రాయల్ భవనం కూడా ముంబైలోనే నిర్మించారు. ఇది 2018 లో రాగా..ఇందులో 76 అంతస్తులు ఉన్నాయి. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, కోలకతా, బెంగళూరు, చెన్నై, హైద్రాబాద్ లో ఇలా చాలా హై రైజ్ బిల్డింగ్ లు వచ్చాయి అయితే ఇప్పుడు ముంబై లో దేశంలోనే అతి పెద్ద బిల్డింగ్ రానుంది.

అది కూడా 110 అంతస్తులతో. పర్ల్ స్వేరి ప్రాంతంలో ఈ టవర్ నిర్మాణం కానుంది. యూకె కి చెందిన శ్రామ్ అండ్ మరం గ్రూప్ ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఇందులో ఆఫీస్ స్పేస్ తో పాటు మాల్, హోటల్, 50 బెడ్ తో కూడిన ఆస్పత్రి తో పాటు థియేటర్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఆర్కిటెక్ట్ వెంకట్ పిళ్ళై ఈ బహుళ ప్రయోజన స్కై స్క్రాప్పర్ డిజైన్ చేయనున్నారు. దేశంలోనే ఈ తరహా బిల్డింగ్ ఎక్కడ లేని విధంగా నిర్మించబోతున్నారు.

Next Story
Share it