Telugu Gateway
Top Stories

ముంబై విమానాశ్రయం ప్రధాన రన్ వే సురక్షితం కాదు !

ముంబై విమానాశ్రయం ప్రధాన రన్ వే సురక్షితం కాదు !
X

దేశం లోనే అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఒకటి. ఈ విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ వందల సంఖ్యలో విమానాలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటి కీలక విమానాశ్రయంలోని ప్రధాన రన్ వే ఏ మాత్రం సురక్షితం కాదు అని గతంలో ముంబై విమానాశ్రయంలో ఏవియేషన్ సేఫ్టీ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా , ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా పనిచేసిన మంగళ నరసింహన్ వెల్లడించారు. ప్రధాన రన్ వే 09 / 27 సమస్య గురించి తాను 2012 సంవత్సరం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ రన్ వే లో ఉన్న తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులను విస్మరిస్తున్నట్లు ఆమె ఫ్రీ ప్రెస్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. ఇదే పరిస్థితి కాలికట్ విమానాశ్రయం రన్ వే లో కూడా ఉంది అని వెల్లడించారు. ఈ కారణంగానే అక్కడ 2020 ఆగష్టు 7 న ఒక ప్రమాదం జరిగి 19 మంది ప్రయాణికులు చనిపోయారని వెల్లడించారు.

కానీ ఇక్కడ తప్పును మాత్రం చనిపోయిన పైలట్ ల మీద నెట్టేసి కొరుకున్నారు అని ఆరోపించారు. విమానాశ్రయంలోని లోపాల గురించి ఫిర్యాదు చేయటంతో ఆమెను ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ) వేటు వేసింది. అయినా ఆమె రన్ వే సేఫ్టీ అంశంపై తన పోరాటం కొనసాగిస్తున్నారు. చాలా సార్లు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అని తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్, లాండింగ్ మార్గాల్లో వస్తున్న భవనాలకు అనుమతుల విషయం లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపారు. బాంబే హై కోర్ట్ లో దీనిపై లాయర్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా. ఆమె అన్ని విశయాలనూ కోర్ట్ ముందు ఉంచారు. దీంతో ఆమెపై వేటు పడింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ఈ సంచలన విషయాలను బహిర్గతం చేశారు. .

Next Story
Share it