Telugu Gateway
Top Stories

దుబాయ్ లో విల్లా కొన్న ముఖేష్ అంబానీ..ఖ‌రీదు 640 కోట్లు

దుబాయ్ లో విల్లా కొన్న ముఖేష్ అంబానీ..ఖ‌రీదు 640 కోట్లు
X

దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబ‌య్ లో ఇప్ప‌టికే వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే ఆంటిలియా భ‌వ‌నాన్ని క‌లిగి ఉన్న బిలియ‌నీర్ ముఖేష్ అంబానీ ఇప్పుడు దుబాయ్ లోనూ అత్యంత ఖ‌రీదైన విల్లాను కొనుగోలు చేసి వార్త‌ల్లో నిలిచారు. దుబాయ్ లోనే ప్ర‌పంచ సంప‌న్నులు నివాసం ఉండే పామ్ జుమేరా ప్రాంతంలో అంబానీలు ఈ బీచ్ సైడ్ ఉండే విల్లాను ను కొనుగోలు చేశారు. ఈ విల్లా ఖ‌రీదు భార‌తీయ క‌రెన్సీలో 640 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ విల్లాను అంబానీ త‌న‌యుడు అనంత్ పేరిట కొనుగోలు చేశారు.

ఇందులో ప‌ది బెడ్ రూమ్స్, ప్రైవేట్ స్పా, ఇండోర్, ఔట్ డోర్ పూల్స్ ఉంటాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే అత్యంత సంప‌న్నుల నివాసాల‌కు ఇప్పుడు దుబాయ్ కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది. ఖ‌రీదైన ఇళ్ళు కొనుగోలు చేసేవారికి దుబాయ్ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాలు కూడా మంజూరు చేస్తోంది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కు చెందిన విదేశాల్లోని సంస్థ‌ల ద్వారానే దుబాయ్ లో ఈ డీల్ పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం. ఈ విల్లా నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను కూడా రిల‌య‌న్స్ కార్పొరేట్ ఎఫైర్స్ డైర‌క్ట‌ర్, ఎంపీ ప‌రిమ‌ళ్ న‌త్వానీ చూస్తున్న‌ట్లు చెబుతున్నారు.

Next Story
Share it