Telugu Gateway
Top Stories

ఎలీ లిల్లీతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఒప్పందం

ఎలీ లిల్లీతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఒప్పందం
X

దేశంలో బారిసిటినిబ్ తయారీకి రెడీ

అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ అండ్ కంపెనీతో తాము గురువారం నాడు రాయల్టీ ఫ్రీ, నాన్ –ఎక్స్క్లూజివ్, వాలెంటరీ లైసెన్స్ ఒప్పందాన్ని చేసుకున్నామని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ (ఎంఎస్ఎన్) వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా కోవిడ్–19 కోసం భారతదేశంలో బారిసిటినిబ్ ఔషదాన్ని తయారుచేయడంతో పాటుగా మార్కెటింగ్ కూడా చేయనుంది. కోవిడ్ –19 అనుమానిత లేదా లేబరేటరీలో కోవిడ్–19 నిర్ధారించబడి ఆస్పత్రిలో చేరిన పెద్దలకు ఆక్సిజన్ అవసరం కావడం, మెకానికల్ వెంటిలేషన్ అవసరం పడటం లేదా ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో) చికిత్స పొందుతున్న వారికి రెమిడెసివిర్తో పాటుగా అత్యవసరంగా వినియోగించేందుకు బారిసిటినిబ్ ఔషదానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నియంత్రిత అత్యవసర వినియోగ అనుమతిని మంజూరుచేసింది.

ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండీ– డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ ''కోవిడ్–19తో పోరాడుతున్న భారతదేశపు ప్రయాణంలో ఎలి లిల్లీ అండ్ కంపెనీతో చేసుకున్న ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఒప్పందంతో బారిసిటినిబ్ లభ్యత పెరగడంతో పాటుగా అందుబాటు ధరలో సైతం లభించేందుకు వీలు కలుగుతుంది'' అని అన్నారు. ఎంఎస్ఎన్ ఈ ఔషదాన్ని బారిడోజ్ బ్రాండ్ పేరిట విడుదల చేయనుంది. ఇది 2ఎంజీ మరియు 4ఎంజీ మోతాదులలో లభ్యమవుతుంది. ఎంఎస్ఎన్ దీనికి సంబంధించి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ మరియు బారిసిటినిబ్ ఫార్ములేషన్ను తమ అంతర్గత ఆర్ అండ్ డీలో రూపొందించడంతో పాటుగా తమ యూనిట్లలో తయారుచేస్తుంది. కోవిడ్ చికిత్సా శ్రేణిలో భాగంగా ఎంఎస్ఎన్ ఇప్పటికే ఫావిఫ్లో (ఫావిపిరావిర్)ను 200ఎంజీ, 400ఎంజీ, 800ఎంజీ మోతాదుల్లో ఒసెఫ్లో(ఒసెల్లామివిర్)ను 75ఎంజీ క్యాప్సూల్స్లో విడుదల చేసింది.

Next Story
Share it