Telugu Gateway
Top Stories

రియల్ టైం సమాచారం కోసం

రియల్ టైం సమాచారం కోసం
X

భారత్ లో ప్రొఫెషనల్, వాణిజ్య రేడియోలను పంపిణి చేసేందుకు మోటోరోలా సొల్యూషన్స్ తో పూణే కేంద్రంగా పనిచేసే ఆర్య ఓమ్నిటాక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్య ఓమ్నిటాక్ రేడియో కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ విషయంలో అతి పెద్ద సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. ఆర్య ఓమ్నిటాక్ మూడు బిజినెస్ డివిజన్స్ తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందులో ఒకటి షేర్డ్ మొబైల్ ఆటో సర్వీసెస్ అయితే జీపీఎస్ ఆధారిత ఫ్లీట్ ట్రాకింగ్..నిర్వహణ సొల్యూషన్స్, టోల్ అండ్ హై వే ట్రాఫిక్ నిర్వహణ సిస్టమ్స్ ఉన్నాయి.

తాజా ఒప్పందం ప్రకారం ఆర్య ఓమ్నిటాక్ తన కస్టమర్స్ కు మోటోరోలా సొల్యూషన్స్ ఉత్పత్తులు అందించనుంది. కంపెనీ అందించే రేడియో లు వేగంగా మారుతున్న ప్రస్తుత వ్యాపార వాతావరణానికి ఎంతో అనుకూలంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. రియల్ టైం లో అప్పటికప్పుడు సమాచారం చేరవేయడానికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.

Next Story
Share it